యూరియా కోసం రైతుల రాస్తారోకో
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. నెల రోజులుగా ఎదురుచూస్తున్నా తమకు యూరియా దొరకడం లేదని వారు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ప్రతి రోజూ జిల్లావ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. సోమవారం బెజ్జూర్ మండలం బస్టాండు వద్ద రైతుల రాస్తా రోకో నిర్వహించారు. నెల రోజులుగా తమకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ యూరియా కోసం చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తోందన్నారు. అధికారుల తీరుపై రైతులు మండి పడుతున్నారు.