రూ. 2,360 కోట్లు.. 34 శాతం..

Singareni: సింగ‌రేణి కార్మికులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న లాభాల వాటాను ప్ర‌క‌టిస్తూ తెలంగాన‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తీ ఏటా దసరాకు ముందుగా సింగరేణి కార్మికులకు లాభాల వాటాను యాజమాన్యం అందజేస్తుంది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి సమ‌క్షంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి కార్మికుల‌కు లాభాల వాటా కింద రూ. 2,360 కోట్లు అంద‌చేయ‌నున్నారు. ఇందులో 34 శాతం లాభాల వాటా కింద చెల్లించనున్నారు. 41 వేల మంది సింగ‌రేణి కార్మికులు.. ప్ర‌తి కార్మికుడికి రూ. 1,95,610 వ‌స్తాయ‌ని చెప్పారు. 30 వేల మంది కార్మికుల‌కు సైతం లాభాల్లో వాటా కింద అంద‌చేయనున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభం రూ. 4,701 కోట్లు కాగా, ఇందులో రూ.2,283 కోట్లు సింగరేణి భవిష్యత్‌ ప్రణాళిక కోసమని పక్కన పెట్టి, మిగిలిన రూ.2,414 కోట్లలో 33 శాతం వాటా రూ. 796 కోట్ల కార్మికులకు అంద‌చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like