కార్మికుల ఆగ్రహానికి గురి కాక తప్పదు
TBGKS:లాభాల వాట విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందనీ వారి ఆగ్రహానికి గురికాక తప్పదని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్ రాజ్ శ్రీనివాసరావు హెచ్చరించారు. సింగరేణి ఉద్యోగులకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ. 6,394 కోట్ల రూపాయల నుండి రూ. 4,034 కోట్లు మినహాయించి తక్కువ చెల్లించడాన్ని టీబీజీకేఎస్ ఖండిస్తున్నదన్నారు. సింగరేణికి వచ్చిన మొత్తం లాభాలు రూ.6,394 కోట్లలో 34శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియాలో గనులు, డిపార్టుమెంట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నామనీ వెల్లడించారు. కార్మికులు సైతం నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తున్నారనీ చెప్పారు.
కార్యక్రమంలో కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో పిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్ సెంట్రల్ నాయకులు ఓరం కిరణ్ గోలేటి సీహెచ్పీ లో ఫిట్ సెక్రెటరీ మెరుగు రమేష్, ఏరియా నాయకురాలు వరలక్ష్మి, ఆఫీసు ఇంచార్జి వంగ మహేందర్ వర్క్ షాప్ లో సెంట్రల్ నాయకుడు మాంత్ సమ్మయ్య పిటి కార్యదర్శి శ్రీనివాస్ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి సురేష్ ఉన్నారు.