యూరియా కోసం తిప్పలు

-బారులు తీరుతున్న రైతులు
-ఆందోళన చెందవద్దంటున్న అధికారులు

Urea:జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. దీంతో పలు మండలాల్లో సోమవారం ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద బారులు తీరారు. పరిమితంగానే యూరియా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రైతు వేదిక వద్ద ఉదయం నుంచి రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. యూరియా రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చి క్యూలైన్‌లో నిలబడ్డారు. దాదాపు 500 మంది రైతులు రైతు వేదిక వద్దకు రావడంతో పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఎట్లాంటి గొడవలు జరగకుండా అందరినీ క్యూ లైన్లో నిలబెట్టి యూరియా సక్రమంగా అందేలా చర్యలు తీసుకన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like