ముఖ్యమంత్రి మోసం.. కార్మికులకు శాపం…

TBGKS:కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతా అని చెప్పిన ముఖ్యమంత్రి వారిని మోసం చేశారని TBGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. లాభాల వాటలో కార్మికులకు జరిగిన అన్యాయానికి నిరసనగా అన్ని గనులు, డిపారెట్మెంట్లపై నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,701 కోట్ల రూపాయల నికర లాభాలలో కంపెనీ భవిష్యత్తు అవసరాల కోసమని రూ.2,289 కోట్లు పక్కకు పెట్టి మిగతా రూ.2,412 కోట్ల మీద 33 శాతం అని చెప్పి 796 కోట్లను ప్రకటించడం దారుణం అన్నారు.

అదే మోసాన్ని తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకుల సమక్షంలో అదే మోసం కొనసాగించారని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభాలు 6394 కోట్ల రూపాయలు అని ప్రభుత్వం, యాజమాన్యము ప్రకటిస్తూ 4,034 కోట్ల రూపాయలను కంపెనీ భవిష్యత్ కోసం పక్కకు పెడుతున్నామని చెప్పుకోచారని తెలిపారు.2360 కోట్ల రూపాయల మీద 34 శాతం అని 802.4 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించి కార్మిక వర్గాన్ని కుట్రపూరితంగా మోసగించి నయవంచనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లెక్కల ప్రకారం వాస్తవానికి ప్రభుత్వము యాజమాన్యం 12.6 శాతం మాత్రమే కార్మిక వర్గానికి ప్రకటించిందన్నారు. అంటే గత సంవత్సరం కంటే నాలుగు శాతం తక్కువ లాభాలను కార్మిక వర్గానికి పంచుతూ అంకెల గారడితో లెక్కలను మారుస్తూ మోసం చేసిందనీ ఆవేదన వ్యక్తం చేశారు.

మోసాన్ని గుర్తించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేవలం కార్మిక వర్గానికి ఇచ్చింది 16.9 శాతం మాత్రమే అని.. ఆడిట్ షీట్లు బయటపెట్టాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభాలు 6394 కోట్ల రూపాయల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 34 శాతం వాటాను విడుదల చేయాలని దశల వారి ఆందోళనలో భాగంగా ఈరోజు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశామన్నారు.

▶️ Srp-3 గని మీద నల్ల బ్యాడ్జీలతో నిరసన అనంతరం గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా సెక్రటరీలు సాదుల భాస్కర్, ఉత్తేజి రెడ్డి, ఫిట్ సెక్రెటరీ గడ్డం వెంకట్ రెడ్డి, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ టి.నరేష్, వెంకటరమణారెడ్డి, వినయ్, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.

▶️శ్రీరాంపూర్ ఓసిలో ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్, ఏరియా సెక్రటరీ గడ్డం మైపాల్ రెడ్డి, ఫిట్ సెక్రటరీ గడ్డం సుధాకర్, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ జంగా రమేష్, క్రాంతి, సంపత్, అనిరుద్, శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు.

▶️ Rk-5గనిలో కేంద్ర చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీ పోగాకు రమేష్, ఏరియా జాయింట్ సెక్రెటరీలు గోవిందుల రమేష్,ఫిట్ సెక్రెటరీ దుర్గం రవికుమార్, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ పాపిరెడ్డి, చిప్ప రమేష్, జాడి శ్రీనివాస్, రాజేశం, బండారి శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

▶️Rk-7 గనిలో కేంద్ర సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, ఫిట్ కార్యదర్శి రాజు నాయక్, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ పాదం శ్రీనివాస్, బిరుదు శ్రీనివాస్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

▶️RK-NT గనిలో కేంద్ర కార్యవర్గ సభ్యులు ఎండి లాల, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ జైపాల్ రెడ్డి, తలారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

▶️SRP-1 గనిలో ఏరియా కార్యదర్శి వెంగళ కుమారస్వామి, పిట్ కార్యదర్శి కురుమ వికాస్, మేడం తిరుపతి, తిరుపతిరావు, సముద్రాల అన్వేష్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

▶️ఇందారం గని, ఓసిలో కేంద్ర ఆర్గనైజ్ సెక్రెటరీ అన్వేష్ రెడ్డి, ఏరియా సెక్రెటరీ గొర్ల సంతోష్, ఫిట్ కార్యదర్శులు గడ్డం మల్లన్న, గోకర్ల గోపాల్, రామారావు, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

▶️శ్రీరాంపూర్ సిహెచ్పిలో ఏరియా సెక్రటరీ బుస్సా రమేష్, ఫిట్ సెక్రెటరీ అందే రాజ్ కుమార్, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ లక్ష్మణ్, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like