న్యాయం చేయాలని ట్యాంక్ ఎక్కిన కుటుంబం
తమకు న్యాయం చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో బొలిశెట్టి మహేష్ కీర్తన అనే దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశారు. తమ తల్లి, తమ్ముడి పేరుపై ఉన్న భూమిని రెవెన్యూ శాఖ అధికారులు అక్రమంగా వేరే వ్యక్తిల పేరుపై మార్చారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ ఐబీ ఏరియా వాటర్ ట్యాంకర్ ఎక్కారు.
హాజీపూర్ మండలం సబ్బపల్లి శివారులో ఉన్న తమ భూమిని సావిత్రి అనే పేరుపై రెవెన్యూ అధికారులు పట్టా చేశారని వారు అవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు రాజేష్ మానసిక స్థితి సరిగ్గ లేదని తెలిసి, తల్లిని కుమారులు చూసుకోవడం లేదని కారణం చెప్తూ.. తమ బంధువులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై భూమి మార్చుకున్నారని ఆరోపించారు.
ఆఫిస్ల చుట్టూ తిరిగితే తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడు మహేష్ తో సహా వారు ట్యాంక్ ఎక్కారు. స్థానికులు నచజెప్పడంతో కుమారుడిని దించి నిరసన కొనసాగించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.