రోడ్డు ప్రమాదంలో RMP దుర్మరణం..

Road Accident:కొమరం జిల్లా ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మండలం పెద్ద వాగు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, బైక్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఆసిఫాబాద్ నుండి కాగజ్ నగర్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాగజ్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మొహమ్మద్ అష్రఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని సోదరుడు అజీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాల పాలైన మొహమ్మద్ అష్రఫ్ ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా అజీమ్ RMP గా పని చేస్తున్నాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like