బ్రాండెడ్ పేరుతో రేషన్ బియ్యం.. ఒకరి అరెస్టు
బ్రాండెడ్ పేరుతో రేషన్ బియ్యం అమ్ముతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు.. నిందితుని వద్ద నుంచి ఆటో, 6 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో ఉన్న ఆంధ్ర కిరాణా యజమాని షేక్ అయూబ్ అరెస్టు చేశారు. అతనిపై ఇది వరకే ఎన్నో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ దుకాణం జప్తు కోసం ఆర్డీవోకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో ఆంధ్ర కిరాణం యజమాని షేక్ అయూబ్ బ్రాండెడ్ రైస్ సంచులలో రేషన్ బియ్యం నింపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇది పోలీసుల దృష్టికి రావడంతో అతన్ని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇతనిపై ఇది వరకే ఆదిలాబాద్ పట్టణంలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. అమాయక ప్రజలను రాయితీ బియ్యం సంచులలో నింపి బ్రాండెడ్ పేరుతో అమ్ముతూ పట్టుబడ్డాడని చెప్పారు. ఇతని వద్ద నుంచి ఆరు క్వింటాళ్ల రాయితీ బియ్యాన్ని, ఒక ఆటోని సీజ్ చేశామన్నారు. పదే పదే నేరాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని.. అందుకే ఇతని దుకాణాన్ని జప్తు చేయడానికి ఆదిలాబాద్ ఆర్డీవోకు సిఫార్సు చేశామన్నారు.