అడవిలో మృత దేహాల కలకలం
Dead bodies in the forest:అడవిలో రెండు మృత దేహాలు కలకలం సృష్టించాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్ టీ మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన దూలం శేఖర్, దూలం సుశీల భార్యా భర్తలు. వీళ్లు ఇద్దరూ పశువుల కాపర్లుగా జీవనం సాగిస్తున్నారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి వెతకగా అర్ధరాత్రి సిర్పూర్ టి భీమన్న సమీపంలోని అటవీ ప్రాంతంలో వారి మృత దేహాలు లభ్యం అయ్యాయి.
వీరి పై ఏదైనా అడవి జంతువు దాడి చేసిందా…? మరేదైనా ప్రమాదం జరిగిందా…? అన్ని రకాల కోణాల్లో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు… ఒక కొడుకు ఉన్నాడు. మృతదేహాలను సిర్పూర్ టీ ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు.