తెలంగాణకు అమృత్‌భారత్ రైలు..
ఎక్కడెక్కడ ఆగుతుందంటే...?
Amrit Bharat Express train:సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express train) రైలు తెలంగాణలో పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలెక్కింది. బీహార్‌లోని ముజఫర్‌పుర్ నుంచి చర్లపల్లికి వచ్చే ఈ ట్రైన్ (నెంబర్ 15293/15294)ను సోమవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ ప్రారంభించారు. ముజఫర్‌పుర్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ రైలు బయల్దేరింది. చర్లపల్లికి మంగళవారం రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ముఖ్యంగా పేదలు, సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ రైలులో కేవలం స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. ఇందులో ఏసీ బోగీలు ఉండవు. తెలంగాణలో ఈ రైలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త రైలు సేవలు బీహార్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు తెలంగాణ నుంచి ప్రయాణించే వారికి మెరుగైన, చౌకైన ప్రత్యామ్నాయాన్ని అందించనున్నాయి.