ఆ చెత్త తొలగించెది ఎవరు…?
మాదారంలో సింగరేణి ఆసుపత్రి లైన్ లో విపరీతమైన చెత్త పేరుకుపోయింది. దాదాపు పది రోజులు అవుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
సింగరేణి పార్కులో కొద్ది రోజుల కిందట కోనోకార్పస్ చెట్లను కొట్టేశారు. పార్క్ చుట్టూ ఉన్న చెట్లను కొట్టేశారు. ఇంత వరకు బాగానే ఉంది. నరికిన చెట్లను పార్క్ చుట్టూ పడేశారు. దాన్ని తొలిగించకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆ చెత్తతో దోమలు వ్యాపిస్తున్నాయనీ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటు గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇటు సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. పండగ ముందర తమ ఇండ్ల ముందు ఈ చెత్త గోల ఏమిటనీ వారు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా పార్కు చుట్టూ ఉన్న చెత్త తొలగించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అధికారులు పట్టించుకుంటారా..? ప్రజల సమస్య అలాగే గాలికి వదిలేస్తారా చూడాలి మరి…