పోటాపోటీగా కొనసాగుతున్న సద్దుల బతుకమ్మ
Saddula Bathukamma:బతుకమ్మ అంటే సంబురం… బతుకమ్మ అంటే ఆటాపాటా… కానీ, ఓ ఊర్లో మాత్రం రెండు వర్గాల మధ్య పోటీగా మారింది.. దీంతో 24 గంటలుగా సద్దుల బతుకమ్మ వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి…
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం నౌగంబస్తీలో నిన్న సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభం అయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైన వేడుకలు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాలకు చెందిన మహిళలు నిన్నటి నుండి పోటా పోటీగా బతుకమ్మ అడుతున్నారు. ముందు మీరు లేపాలని ఒక్క వర్గం.. లేదు ముందు మీరే లేపాలని మరో వర్గం.. ఇలా బతుకమ్మ ఆట కొనసాగుతూనే ఉంది… వారు 24 గంటలుగా బతుకమ్మ అడుతూనే ఉన్నారు… మరి ఆ మహిళల పోటీ ఎప్పుడు ముగుస్తుందో.. ఆ సద్దుల బతుకమ్మ నీళ్లలో ఎప్పుడు పడుతుందో… చూడాలి మరి..