ఎన్నిక‌ల కోసం హెల్ప్ లైన్ నంబ‌ర్

Helpline number for elections:స్థానిక ఎన్నిక‌ల నిర్వహణలో భాగంగా క‌లెక్ట‌రేట్‌లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన‌ట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నిర్వహించనున్న ఎన్నికల దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ నంబ‌ర్ ఏర్పాటు చేశామ‌న్నారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ ఇతర ఎన్నికల సంబంధించి సమాచారం, ఫిర్యాదులు, ఇతర దరఖాస్తుల కోసం హెల్ప్ లైన్ నం.08736-250501 ఏర్పాటు చేశామ‌న్నారు.

ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళి అమలులో ఉందని, నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లో సమాచారం అందించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఎన్నికల సంబంధిత సమాచారం, ఫిర్యాదుల కోసం సంప్రదించవచ్చని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like