మ‌హిళ‌ల‌ను వేధిస్తున్న ఆక‌తాయిలు.. ప‌ట్టుకున్న షీ టీం బృందం

She Team:ద‌స‌రా సంద‌ర్భంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్‌లో మ‌హిళ‌ల‌ను వేధిస్తున్న ఆక‌తాయిల‌ను ప‌ట్టుకుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గురువారం కాగ‌జ్‌న‌గ‌ర్‌లోని త్రిశూల్ పహాడ్ ఏరియాలో రావణ దహనం జ‌రుగుతున్న సమయంలో అమ్మాయిలను ఆటపట్టిస్తన్న‌ ఆరుగురు ఆకతాయిలను షీ టీం బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వారి పెద్ద‌ల‌ను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. కార్య‌క్ర‌మంలో షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ సునీత, రమాదేవి, స్వప్న, శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళలు యువతులు ఎవరైనా ఇబ్బందులకు గురైతే కాగ‌జ్‌న‌గ‌ర్‌ షీ టీమ్ నెంబర్ 8712670565కి సమాచారం అందించాలని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like