రోడ్లపై పుట్టినరోజు వేడుకలు.. కేసు న‌మోదు

ఆదిలాబాద్ జిల్లా మావ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో రోడ్డుపైనే పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్న వ్య‌క్తి, అత‌ని అనుచ‌రుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. గత నెల 19వ తారీఖున న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో షెల్కే అజయ్ @ మహాకాల్ అజయ్ అనే వ్యక్తి అనుమతులు లేకుండా రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నాడు. దీంతో అత‌డు, అతని అనుచరులపై మావల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన‌ట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి వెల్ల‌డించారు. గత నెల 19న అనుమతులు లేకుండా రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు పబ్లిక్ న్యూసెన్స్, రోడ్డును అడ్డుకోవడం, అనుమతులు లేకుండా టపాసులు కాల్చడం, అరుపులు శబ్దాలతో చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందులు కలిగించిన కారణంగా క్రైమ్ నెంబర్ 528/2025, u/sec 126(2), 292, 226 r/w (3)(5), సెక్షన్ల కింద కేసు నమోదు చేశామ‌న్నారు,

ప్రజా ప్రదేశాల్లో అనుమతులు లేకుండా పుట్టినరోజు వేడుకలు చేయడం ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటివి చట్ట విరుద్ధమన‌నారురు. ఒకరి పుట్టినరోజు వేడుకలు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని తమ ఇంటి వద్ద వేడుకలను నిర్వహించుకుంటే మంచిదన్నారు. మహాకాళి గ్రూప్, టైగర్ గ్రూప్, ఈగల్ గ్రూప్, యువశక్తి గ్రూప్ అంటూ కొందరు తమ గ్రూపు అధ్యక్షుల పుట్టినరోజు వేడుకలను రోడ్లపై నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నార‌ని చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. కార్యక్రమంలో మావల సీఐ కర్ర స్వామి, ఎస్సైలు ఎల్ ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనలో అనుచరులలో రోహిత్ షిండే ఉన్నందున అతనిపై కూడా కేసు నమోదు అయిందని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like