బ‌తుక‌మ్మ ఆడుతూ మ‌హిళ మృతి

Woman dies while playing Bathukamma: నిర్మ‌ల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ‌తుక‌మ్మ ఆడుతూ ఓ మ‌హిళ మృతి చెందింది. భైంసా మండ‌లం వాన‌ల్‌పాడ్ లో బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో రుశిత (25) అనే మ‌హిళ బ‌తుక‌మ్మ ఆడుతుండ‌గా అస్వ‌స్థ‌త‌కు గురైంది. దీనిని గ‌మ‌నించిన కుటుంబ‌స‌భ్యులు ఆమెను భైంసాలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందింది. న‌ర్సాపూర్‌(జీ) గొల్ల‌మాడ‌కు చెందిన రుశిత‌కు భైంసా మండ‌లం వాన‌ల్‌పాడ్ కు చెందిన రాజు అనే వ్య‌క్తితో ఈ ఏడాది మే నెల‌లో వివాహం జ‌రిగింది. అత్త‌వారింట మొద‌టి బ‌తుక‌మ్మ ఆడుతూ మృత్యువాత ప‌డ‌టంతో విషాదం నెల‌కొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like