ఆదివాసీల ఆందోళన
అటవీ శాఖ అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమకు సంబంధం లేని కేసులు పెట్టి తీవ్రంగా వేధిస్తున్నారని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్ కార్యాలయ ప్రాంగణంలో భైఠాయించి తమ నిరసన తెలిపారు. అడవి నరికివేతతో ఎలాంటి సంబంధం లేని ఆదివాసీ నాయకులను చర్చల పేరుతో పిలిపించి పిలిపించి చెట్లను నరికినట్లు తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అనాలోచితంగా వ్యవహారిస్తూ చనిపోయిన వారి మీద కూడ కేసులు నమోదు చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అటవీ అధికారులు స్పందించి అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.