బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పోరాడుతాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
Mallu Bhatti Vikramarka:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ధర్మానం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామని అన్నారు. వాస్తవసమాచారం (ఎంపీరికల్ డేటా) ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. తమ దగ్గర పూర్తి సమాచారం ఉంది కాబట్టి కోర్టులో తమకు ఇబ్బంది ఉంటుందని అనుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు ఆయన స్పష్టం చేశారు.