కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా
Fake WhatsApp account in the name of Nirmal District Collector:సైబర్ నేరగాళ్లు ఏకంగా కలెక్టర్ పేరు, ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ డీపీతో సైబర్ నేరగాళ్లు వాట్సప్ ఖాతా సృష్టించి ఆ నంబర్ ఉంచి జిల్లా కలెక్టర్ డబ్బులు అడుగుతున్నట్లు సందేశాలు పంపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అటువంటి సందేశాలను పంపలేదని, ఈ ఖాతా పూర్తిగా నకిలీదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. అటువంటి నకిలీ ఖాతాల నుండి వచ్చే ఏవైనా సందేశాలకు స్పందించవద్దని, వాటిని ఫార్వార్డ్ చేయవద్దని అందరు అధికారులు, మీడియా ప్రతినిధులు, ప్రజలను కోరుతున్నట్లు వారు వెల్లడించారు. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని అధికారులు తెలిపారు.