బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా

High Court:బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టులో విచార‌ణ వాయిదా ప‌డింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ అంశంపై విచారిస్తామ‌ని హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ బెంచ్ స్ప‌ష్టం చేసింది. రిజర్వేషన్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్ర‌శ్నించారు. దీంతో రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని లాయర్లు వెల్ల‌డించారు. విచార‌ణ సంద‌ర్భంగా షెడ్యూల్‌ విడుదల అయ్యిందని బెంచ్‌కు తెలిపారు లాయర్లు. సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాన్ని సైతం వారు ప్రస్తావించారు. ఆరు పిటిషన్లను ఒకేసారి వింటామన్న హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్ స్ప‌ష్టం చేయ‌డంతో పాటు విచార‌ణ మ‌ధ్యాహ్నం 12.30కి వాయిదా వేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like