టెన్షన్.. ఎక్స్టెన్షన్… బీసీ రిజర్వేషన్లపై లంచ్ తర్వాత విచారణ
High Court:బీసీ రిజర్వేషన్లపై విచారణ కొనసాగుతోంది. రెండు వర్గాల వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు మిగిలిన వాదనలు వింటామని స్పష్టం చేసింది. దాదాపు గంటన్నర పాటు వాదనాలు కొనసాగాయి. లంచ్ తర్వాత ప్రభుత్వం తర్వాత వాదనలు కొనసాగనున్నాయి. దాదాపు నలుగురు లాయర్లు తమ వాదనలు వినిపించనున్నారు.
అంతకుముందు ట్రిపుల్‌టెస్ట్ పైనే వాదనలు కొనసాగాయి. ట్రిపుల్ టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ప్రస్తావించారు. ట్రిపుల్ టెస్టు లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ సందర్భంగా సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను లాయర్ బుచ్చిబాబు గుర్తు చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ లాయర్ ప్రస్తావించారు.
రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఎన్నికలకు సంబంధించి కేవలం షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారని, నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదన్న లాయర్లు వెల్లడించారు. తాము నాలుగు అంశాల ఆధారంగా జీవో 9 ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు. వన్‌మ్యాన్ కమిషన్ నివేదిక బయటపెట్టలేదని అడ్వకేట్ వివేక్‌రెడ్డి స్పష్టం చేశారు. ట్రిపుల్ టెస్టు లేకుండానే రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని చెప్పారు. అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాసైందని చీఫ్ జస్టిస్ ప్రశ్నించడంతో ఆగస్ట్ 31 రెండు సభల్లో పాసైందని లాయర్ వెల్లడించారు.
గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉందా అని జడ్జి ప్రశ్నించడంతో గవర్నర్ దగ్గర బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉందని, బిల్లు ఇంకా చట్టంగా మారలేదన్న పిటిషనర్ స్పష్టం చేశారు. అదే సమయంలో జీవో 9తో పాటు జీవో నెంబర్ 41 కూడా చెల్లదని లాయర్ వాదించారు. దీంతో లంచ్ తర్వాత 2.30 గంటలకు వాదనలు వింటామని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ స్పష్టం చేసింది.