బీఆర్ఎస్ నేత‌ల హౌస్ అరెస్టు

House arrest of BRS leaders:సిటీ బస్సుల్లో పెంచిన చార్జీలను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ (BRS) గురువారం ‘చలో బస్‌భవన్‌’ కార్యక్రమాన్ని చేపట్టింది. బీఆర్‌ఎస్ నేత‌లంతా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ బస్‌భవన్‌కు చేరుకుని, అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేలా ఆందోళ‌నకు ప్లాన్ చేశారు.

అయితే, పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ బీఆర్ఎస్ నేత‌ల‌ను హౌస్ అరెస్టు చేస్తున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు హౌస్‌ అరెస్టు చేశారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందా, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ఇంటి ఎదుట సైతం పోలీసులు మోహ‌రించారు. నేత‌ల‌ను గృహనిర్బంధం చేశారు.

బస్‌భవన్ ద‌గ్గ‌ర సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున‌ పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like