ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

కాంగ్రెస్ నేత‌ల వేధింపుల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న వేమ‌న‌ప‌ల్లి బీజేపీ నేత ఏట మ‌ధూక‌ర్ కుటుంబానికి న్యాయం చేయాల‌ని, కార‌కులైన వారిని వెంట‌నే అరెస్టు చేయాల‌ని బెల్లంపల్లిలో బీజేపీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ధార కళ్యాణి ఆధ్వర్యంలో కాంటా చౌరస్తాలో రాస్తారోకో, దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయ‌కులు అక్ర‌మ కేసులు పెట్టించి ఏట మ‌ధూక‌ర్‌ను మాన‌సిక వేద‌న‌కు గురిచేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ నాయ‌కులు, పోలీసుల ఒత్తిడి వ‌ల్ల‌నే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. తాను రాసిన సూసైడ్ నోట్‌లో త‌న చావుకి కార‌ణం కాంగ్రెస్ నేత‌లు రుద్రభట్ల సంతోష్, చింతకింది కమల, గాలిమధు అని చెప్పినా వారిని ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు చేయ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. అత‌ని చావులో నీల్వాయి SI ఒత్తిడి కూడా అధికంగా ఉంద‌న్నారు. ఇప్ప‌టికైనా వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని, లేక‌పోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కుని రాజుల అరవింద్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, దూది ప్రకాష్, ఏర్పుల రాజయ్య, జీదుల రాములు, వడ్నాల స్వామి, తాండూరు మండల ఇంచార్జ్ మద్దర్ల శ్రీనివాస్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొమాస కమల, పట్టణ కోశాధికారి సంతోష అగర్వాల్, ఏర్రోజు శ్రీనివాస్, షేక్ గౌస్ బాబా, శాంతమ్మ, తోటపల్లి ఓం సాయి పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like