కానిస్టేబుల్ హ‌త్య కేసులో నిందితుడి అరెస్ట్‌

Accused arrested in constable murder case:నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడ్ని పోలీసులు సినీ ఫక్కీలో చేజ్‌ చేసి పట్టుకున్నారు. రెండు రోజుల కింద‌ట‌ ప్రమోద్‌ను కత్తితో పొడిచి పరారైన నిందితుడు రియాజ్‌ను నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ సమీపంలో అరెస్ట్‌ చేశారు. రోడ్డు పక్కన ఉన్న పాడుబడిన లారీ క్యాబిన్‌లో దాక్కునట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. డ్రోన్‌లతో అన్వేషిస్తూ అదుపులోకి తీసుకున్నారు.

వరుస చోరీలకు పాల్పడుతున్న రియాజ్‌ను సీసీఎస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌ రెండు రోజుల కింద‌ట‌ అదుపులోకి తీసుకుని బెక్‌పై వెళ్తుండగా.. సడెన్‌గా కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌ ఛాతిలో పొడవడంతో పాటు అతడి మేనల్లుడు ఆకాశ్‌‌‌‌, ఎస్సై విఠల్‌‌‌‌ను గాయపరిచి పారిపోయాడు. దీంతో.. ఈ కేసును చాలెంజ్‌‌‌‌గా తీసుకున్న సీపీ సాయిచైతన్య.. నిందితుడు రియాజ్‌‌‌‌ను పట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. రెండు రోజులుగా డ్రోన్‌లు, స్పెషల్ టీమ్‌లతో రియాజ్‌ కోసం నిజామాబాద్‌ పోలీసులు గాలిస్తుండగా.. శనివారం రాత్రి నిజాంసాగర్‌ కెనాల్‌ సమీపంలో చిక్కినట్టే చిక్కి పారిపోయాడు. రియాజ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆసిఫ్ అనే యువకుడిపై రియాజ్ కత్తితో దాడికి యత్నించడం.. ఇద్దరిమధ్య పెనుగులాటలో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో ఇద్దరినీ హాస్పిటల్ కు తరలించిచారు పోలీసులు.

మరోవైపు రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారు అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. వెంటనే, అప్రమత్తమై తుపాకులు ఎక్కుపెట్టడంతో రియాజ్ దొరికిపోయాడు.

You might also like