అక్రమ టేకు కలప పట్టివేత
ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. డాగ్‌స్క్వాడ్ సాయంతో ఈ కలప పట్టుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా తాళ్లపేట రేంజ్ పరిధిలోని కొత్త మామిడిపల్లిలో ఓ ఇంట్లో అక్రమ కలప నిల్వ చేశారనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు దాడులు చేశారు. తాడ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో గ్రామానికి చెందిన లడ్డు అలియాస్ గనిశెట్టి కార్తీక్ ఇంట్లో నిల్వ ఉంచిన కలప పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్ లో ఎఫ్‌బిఓ (డాగ్ స్క్వాడ్) అనిల్, Hunter కూడా బృందంతో కలిసి పాల్గొనడం గమనార్హం. ఘటనలో మొత్తం ఎనిమిది టేకు దుంగలు స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. వాటి అంచనా విలువ ₹33,606 ఉంటుందని అటవీశాఖ సిబ్బంది వెల్లడించారు. దుంగలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.