కనిపించని సీసీ కెమెరాలు.. వరుస దొంగతనాలు..
షాపులు, ఫ్లాట్లు, నివాస ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో, చివలకు ఇండ్లలో సైతం సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా ఘటన జరిగితే… ముఖ్యంగా దొంగతనం జరిగితే సీసీ కెమెరాల ద్వారా ఖాకీలు నిందితులను పట్టుకుంటారు. పలువురు దొంగలు సైతం ఈ సీసీ కెమెరాల ద్వారానే దొరికిపోతుంటారు.. అయితే, ఆర్టీసీ అధికారులకు ఇదేం పట్టడం లేదు. జనం పెద్ద ఎత్తున తిరిగే ప్రాంతాలైన బస్టాండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించకపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బస్టాండ్లు దొంగతనాలకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. రద్దీ సమయంలో బస్సుల్లో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు దొంగలు తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు. ప్రయాణికుల బ్యాగులు, మెడలోని వస్తువులు, జేబుల్లోని పర్సులు, సెల్ఫోన్లు క్షణాల్లో మాయం చేస్తున్నారు. ఇలాంటి కీలకమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విషయంలో ఆర్టీసీ నిర్లక్ష్యం వహిస్తోంది. ఇది కాస్తా దొంగలకు అనుకూలంగా మారుతోంది. వాస్తవానికి ఆర్టీసీ అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. కానీ అటువైపుగా దృష్టి సారించడం లేదు. పోలీసులు సైతం ఒత్తిడి తీసుకువచ్చి వారితో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని పలువురు కోరుతున్నరాఉ.
నెలకు రెండు దొంగతనాలు..
కాగజ్నగర్ బస్టాండ్లో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. నెలకు రెండు, మూడు దొంగతనాలు జరుగుతున్నాయి. కాగజ్నగర్ నుంచి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణాలు సాగిస్తుంటారు. మంచిర్యాల, హైదరాబాద్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు వచ్చిపోతుంటారు. ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంతో ఇక్కడ చోరీలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ఈ ప్రాంతానికి సత్సంబంధాలు ఉండటంతో.. అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. పలువురు చోరీలకు పాల్పడి మహారాష్ట్రకు పారిపోతుండటంతో పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. కొన్ని సందర్బాల్లో బాధితులు ఫిర్యాదు కూడా చేయడం లేదు.
మహిళ బ్యాగు నుంచి బంగారం చోరీ…
కాగజ్నగర్ బస్టాండ్లో చోరీ జరిగింది. ఓ మహిళ బ్యాగులో నుంచి బంగారు ఆభరాలు దొంగతనం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు… కొమరంభీం జిల్లా కాగజ్నగర్ బస్ స్టాండ్ లో ఓ మహిళ బ్యాగులో నుంచి బంగారు ఆభరాలు చోరి చేశారు. లోన్ వెల్లి నుండి కాగజ్నగర్ వచ్చిన బసులో దిగే క్రమంలో పడోరే సులోచన మహిళ బ్యాగులో నుండి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా నిత్యం చోరీలు జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయాణికుల డబ్బులు కావాలి తప్ప… వారి భద్రత గురించి పట్టించుకోకపోవడం ఏమటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పోలీసులు దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.