కలెక్టర్‌గారూ.. తెలుగులో మాట్లాడండి
Telangana:వీడియో కాన్ఫరెన్స్‌లో ఓ కలెక్టర్ ఇంగ్లీఘలో మాట్లాడుతుండగా, తనని అడ్డుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కలెక్టర్‌గారూ.. తెలుగులో మాట్లాడండి.. తెలుగు వచ్చు కదా… అంటూ చెప్పారు… ఇంతకీ ఏం జరిగిందంటే…
రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరలను పంచేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్యల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.
వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మహిళా సమాఖ్య ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. చీరల తయారీ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులు సిరిసిల్లకు వచ్చి పరిశీలించి బాగున్నాయని చెప్పారని సిరిసిల్ల సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య తెలిపారు. అంతకుముందు వారిని పరిచయం చేసేందుకు జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్(Collector Garima Agarwal) ఇంగ్లీషులో మాట్లాడటం ప్రారంభించారు. దీంతో ముఖ్యమంత్రి కలుగచేసుకుని కలెక్టర్‌గారూ.. తెలుగులో మాట్లాడండి.. తెలుగు వచ్చు కదా.. అంటూ నవ్వారు.. తెలుగు వస్తే వీలైనంత మేరకు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయండి.. అన్ని జిల్లాల మహిళా సంఘాల ప్రతినిధులు ఉన్నారంటూ చెప్పడంతో ఖచ్చితంగా సర్… అంటూ కలెక్టర్ మిగతా అంతా తెలుగులో మాట్లాడటం గమనార్హం.