ఆర్టీసీ బస్సులో పొగలు
Smoke in RTC Bus:మంచిర్యాల జిల్లా(Manchryala District)లో ఓ ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో జనం ఆందోళన చెందారు. డ్రైవర్ అప్రమత్తతో వ్యవహిరంచడంతో ప్రమాదం తప్పింది..
మంచిర్యాల జిల్లా గుడిపేట వద్ద ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. మంచిర్యాల నుండి కోరుట్ల కు వెళ్తున్న కోరుట్ల డిపోకు చెందిన టీఎస్ 21 జడ్ 0080 ఆర్టీసీ బస్ గుడిపేట వద్దకు రాగానే ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. ఒక్కసారిగా బ్రేకు లైనర్లు పట్టేయడంతో పొగలు వచ్చాయి. దీనిని గమనించి బస్ డ్రైవర్ బస్ నిలిపివేశారు. ప్రయాణికులను కిందికి దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి డ్రైవర్ స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారు 77 మంది ఉన్నట్టు సమాచారం. ఒకరిద్దరు అద్దాలు పగులగొట్టుకుని కిందకు దూకినట్లు సమాచారం.