విశ్వసుందరిగా ఫాతిమా బాష్
Miss Universe 2025: థాయిలాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో కిరీటం మెక్సికోను వరించింది. 25 ఏళ్ల వయసున్న ఫాతిమా బాష్ ఈ కిరీటం దక్కించుకుంది. మొత్తంగా 130 దేశాలను ఓడించి ఆమె గెలుపొందింది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో 25 ఏళ్ల మిస్ మెక్సికో ఫాతిమా విజేతగా నిలిచింది. మొత్తంగా ఈ పోటీల్లో 121 దేశాల అందగత్తెలు పాల్గొన్నప్పటికీ.. మిస్ యూనివర్స్ గా ఆమె ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక రన్నరప్‌గా మిస్ డెన్మార్క్ విక్టోరియా క్జేర్ థెల్.. సెకండ్ రన్నరప్‌గా మిస్ నైజీరియా చియెనెల్ ఉవాజ్ నిలిచారు.
ప్రతి పోటీలో ఫాతిమా బాస్ ప్రదర్శించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆమె తెలివితేటలు, ప్రతి పోటీల్లో అద్భుతమైన విజయం, పోటీదారి దృష్టిని ఆకర్షించుకుంది. అంతేకాదు ఆమె నమ్మకంగా పోటీదారులను అధిగమించడానికి అద్భుతమైన ప్రదర్శన తీరును కూడా గ్రాండ్ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగాని నిలిచేలా చేసింది. ఇక భారత్‌లోని రాజాస్థాన్‌కు చెందిన మనికా విశ్వకర్మ టాప్ 12 లోనే నిలిచిపోయారు. అయితే టాప్ 5లో అయినా మనికా విశ్వకర్మ చోటు సంపాదించుకుంటుందని అందరూ ఎదురు చూశారు. స్విమ్ సూట్ లో అద్భుతమైన ఫోటోషూట్, వియాత్నాం డిజైనర్ డ్రెస్ లో ఆమె ఆకట్టుకుంది మనికా ఇంటర్వ్యూలు కూడా అద్భుతంగా ఇచ్చింది.
ఫాతిమా బాష్.. మెక్సికో లోని తబాస్కో రాష్ట్రానికి చెందిన యువతి. దేశ చరిత్రలో ఇదే నాలుగో మిస్ యూనివర్స్ కిరీటం కాగా.. తబాస్కోనుంచి టైటిల్‌ను గెలుచుకున్న మొదటి వ్యక్తిగా ఫాతిమా నిలిచింది. ఫైనల్ రౌండ్స్‌లో డెన్మార్క్, నైజీరియా, థాయ్‌లాండ్, వెనిజులా అందగత్తెలతో కలిసి టాప్-5లో నిలిచిన ఫాతిమా కిరీటాన్ని దక్కించుకుంది. ఫాతిమా ఈ టైటిల్‌ను గెలవడంతో మెక్సికో మొత్తం ఉత్సాహంలో మునిగిపోయింది. టాప్-5లో నిలిచిన ఫాతిమా ఈవెనింగ్ గౌన్, కశ్చన్ అండ్ ఆనర్స్ విభాగాల్లో అదరగొట్టింది. జడ్జీలు అడిగిన చివరి ప్రశ్నకు.. నమ్మకం, ధైర్యం, ప్రేమ ఇవే నా జీవిత స్తంభాలు అని చెప్పడంతో ఆమెకు విశ్వసుందరీ కిరీటం దక్కింది.
ఈ పోటీల్లో భారత్ తరఫున రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన మణిక విశ్వకర్మ పాల్గొన్నారు. టాప్ 30 వరకు చేరుకున్న ఈమె.. టాప్ 12లో ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. ఫైనల్స్‌లో భాగంగా జరిగిన స్విమ్‌సూట్ రౌండ్‌లో మానిక ప్రదర్శన న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తెల్లటి మోనోకినీలో కనిపించిన ఆమె.. ఆ రౌండ్‌లో తగినంతగా రాణించలేకపోవడంతో పోటీ నుంచి నిష్క్రమించింది. మణిక టాప్ స్థాయిలోకి రాలేనప్పటికీ.. భారత ప్రతినిధిగా అంతర్జాతీయ వేదికపై పోటీ చేసి ఆ స్థాయికి రావడం కూడా గొప్ప విషయం అంటూ పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.