జాతీయ రహదారిపై రైతుల నిరసన
Farmers’ protest on the national highway:సీసీఐ(CCI) నిబంధనలు తొలగించాలంటూ రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. నిబంధనల పేరుతో రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్(Adilabad district Boraj) జాతీయ రహదారిపై రైతుల నిరసనకు దిగారు. వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని అఖిల పక్షం నాయకుల డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సీసీఐ నిబంధనలు తొలగించాలన్నారు.
ఎకరానికి కేవలం ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనాలని పరిమితి విధించారని, తేమ శాతం నిబంధన సైతం తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బోరజ్ జాతీయ రహదారిపై అఖిల పక్షం ధర్నా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు వ్యతిరేకంగా ప్ల కార్డులతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పైనే తమ వెంట తెచ్చుకున్న రొట్టెలు రైతులు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు తిన్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో రహదారి పై ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు పలు చోట్ల భారీ వాహనాలను దారి మళ్లించారు.