తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్‌ల బ‌దిలీ

Telangana: తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా చేత‌న్ మైల‌బ‌త్తుల‌, మ‌హేశ్వ‌రం జోన్ డీసీపీగా కే నారాయ‌ణ రెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీవీ ప‌ద్మ‌జ‌, నాగర్‌క‌ర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిర‌ణ్ ప్ర‌భాక‌ర్, మ‌హ‌బూబాబాద్ ఎస్పీగా శ‌బ‌రీష్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖిత‌, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా గిరిధ‌ర్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభ‌వ్, ములుగు ఎస్పీగా కేక‌న్ సుధీర్ రామ్‌నాథ్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ఎస్పీగా సంకీర్త్, గ‌వ‌ర్న‌ర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్‌, పెద్ద‌ప‌ల్లి డీసీపీగా రామ్ రెడ్డి, మ‌ల్కాజ్‌గిరి డీసీపీగా సీహెచ్ శ్రీధ‌ర్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం అడిష‌న‌ల్ ఎస్పీగా అవినాష్ కుమార్, భువ‌న‌గిరి అడిష‌న‌ల్ ఎస్పీగా కంక‌ణాల రాహుల్ రెడ్డి, జ‌గిత్యాల అడిష‌న్ ఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ములుగు అడిష‌నల్ ఎస్పీగా శివం ఉపాధ్యాయ‌, ఆదిలాబాద్ అద‌న‌పు ఎస్పీగా మౌనిక‌, ఏటూరు నాగారం ఏఎస్పీగా మ‌న‌న్ భ‌ట్, నిర్మ‌ల్ ఏఎస్పీగా సాయికిర‌ణ్‌, వేముల‌వాడు ఏఎస్పీగా రుత్విక్ సాయి, స‌త్తుప‌ల్లి ఏసీపీగా యాద‌వ్ వ‌సుంధర‌, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్, వ‌న‌ప‌ర్తి ఎస్పీగా సునీత నియామ‌కం అయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like