కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ది
కాంగ్రెస్ పార్టీ(Congress party) అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు(Mancherial MLA Kokkirala Premsagar Rao) అన్నారు. ఆయన శనివారం హాజీపూర్, లక్షెట్టిపేట్, దండేపల్లి మండలాల గ్రామాలాలకు 61 మంది సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు,
వైద్యపరమైన సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), మంత్రుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో మంచిర్యాల నియోజకవర్గం ఉండేలా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. అభివృద్ధి ఆకాంక్షించే ప్రజలు రానున్న సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ అందరినీ గెలిపించుకుని రాష్ట్రానికి ఆదర్శంగా నిలుద్దామని మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని ప్రేంసాగర్ రావు కోరారు.