అది భార‌త్ చేసుకున్న అదృష్టం

Putin’s India visit:ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్(Russian President Putin) భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ప్రొటోకాల్ ప‌క్క‌న పెట్టి మ‌రీ ప్ర‌ధాని మోదీ(Prime Minister Modi) ఆయ‌నకు విమాన‌శ్ర‌యంలో స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికారు. అయితే, భార‌త ప‌ర్య‌ట‌న‌కు ముందు పుతిన్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. భార‌త‌దేశానికి ఓ గొప్ప వ్య‌క్తి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడ‌ని, ఈ విష‌యంలో భార‌త్(India) అదృష్టం చేసుకుంద‌ని వ్యాఖ్యానించారు. ఓ గొప్ప దేశానికి ఓ గొప్ప వ్యక్తి నాయకత్వం వహిస్తున్నాడని, ఈ విషయంలో భారత్ అదృష్టం చేసుకుందని మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. భారత గడ్డపై మోదీ నివసిస్తోండటం, ఇక్కడ శ్వాసిస్తోండటం ఈ దేశానికి ఎంతగానో మేలు చేస్తుందని చెప్పారు. ఆయన చాలా విశ్వసించదగ్గ నాయకుడని కితాబిచ్చారు. మోదీతో బలమైన, విశ్వసించదగ్గ, విశ్వసనీయమైన, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని తేల్చి చెప్పారు.

భారత్- రష్యా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న మైత్రీ బంధపై ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలక భాగస్వామిగా ఉంటోందని పేర్కొన్నారు. మోదీతో చిరకాల పరిచయం ఉందని పుతిన్ అన్నారు. ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యల పట్ల మోదీ కోప్పడకపోవచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన విషయంలో తాను చూసింది, ఆలోచించినది మాత్రమే చెబుతున్నానని అన్నారు. మోదీలాంటి వ్యక్తితో మాట్లాడటం తనకు చాలా ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. మోదీ మాస్కో వచ్చినప్పుడు ఆయనతో చాలాసేపు టీ తాగుతూ పలు విషయాలపై సాధారణ వ్యక్తుల్లాగే ఆసక్తికరమైన సంభాషణలు జరిపామని గుర్తు చేసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like