రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా హాజరయ్యారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించిన పుతిన్, ప్రధాని మోదీతో ప్రతినిధి బృందం స్థాయి చర్చలకు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండు రోజుల భారత పర్యటన కోసం న్యూఢిల్లీకి వచ్చారు. శుక్రవారం ప్రధాన మంత్రి మోదీతో శిఖరాగ్ర చర్చలు జరపనున్నారు. రష్యా అధినేత నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారి భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని మోదీ, పుతిన్ కార్మిక, పౌర అణుశక్తితో సహా ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.