విద్యుత్‌ఘాతంతో చెలరేగిన మంటలు
ఆదిలాబాద్ జిల్లాలో గడ్డిలోడుతో వెళ్తున్న వాహనం దగ్ధమయ్యింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మసూద్ చౌక్ వద్ద ఎండు గడ్డతో వెళ్తున్న ఐచర్ వాహనంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ వైర్లు తాకడం తో ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు ఆర్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.