ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
వేరే వ్యక్తితో చాట్ చేస్తోందని తన ప్రియురాలిని హత్య చేశాడో వ్యక్తి.. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(30) అనే మహిళకు మొదటి భర్తతో విడాకులు అయ్యాయి. ప్రస్తుతం నాగేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఐదు నెలల కిందట అశ్విని భైంసాలోని ఓ కాలనీలో టీస్టాల్ ప్రారంభించారు. అయితే, కొద్ది రోజులుగా అశ్విని వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటు ఫోన్లో చాటింగ్ చేస్తూ మాట్లాడుతుందన్న అనుమానంతో నగేష్ కొద్ది రోజులుగా ఆమెను అనుమానిస్తున్నాడు. సోమవారం టీస్టాల్ వద్దే కత్తితో పొడిచి హత్య చేశాడు. తనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.