ఆ ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించండి
మందమర్రి ఏరియా జీఎంని కలిసిన ఐఎన్టీయూసీ నాయకులు
సర్పంచ్ ఎన్నికల్లో విధులు నిర్వహించే సింగరేణి ఉద్యోగులకు స్పెషల్ ఎలక్షన్ లీవ్ లకు బదులు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఐఎన్టీయూసీ నాయకులు కోరారు. మందమరి జీఎంను కలిసిన అనంతరం వారు మాట్లాడుతూ స్పెషల్ ఎలక్షన్ లీవ్ ఇవ్వడం వలన సింగరేణి ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ ఎలక్షన్ లీవ్ కి బదులు ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పిస్తే ఓడి మస్టర్లు సంవత్సర మస్టర్లలో కలుపుతారని అన్నారు. దాంతో అలవెన్సులు ఎక్కువ రావడమే కాక ప్లే డే సౌకర్యం కూడా లభించే అవకాశం ఉందన్నారు. ఇవి ప్రోత్సాహకాలు, అంతర్గత అసెస్మెంట్ మార్కులకు లెక్కిస్తారని చెప్పారు.
గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల విధుల్లో పాల్గొన్న సింగరేణి ఉద్యోగులకు ఈ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కనీసం సర్పంచ్ ఎన్నికల్లోనైనా వారికి సరైన న్యాయం చేకూరేలా యజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్, జాయింట్ సెక్రెటరీ జగన్నాధ చారి తదితరులు పాల్గొన్నారు.