ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచుతూ దొరికిపోయాడు

పంచాయతీ ఎన్నికల సంద‌ర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతున్న వ్య‌క్తిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు నార్నూర్ సీఐ అంజమ్మ తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తిపై నార్నూర్ పోలీసుస్టేషన్‌లో Cr.No.134/2025 తో పంచాయతీ రాజ్ చట్టం కింద కేసు నమోదు చేశామ‌న్నారు. 10.12.2025 తేదీ అర్ధరాత్రి నార్నూర్ గ్రామంలోని ముస్లింవాడ పరిసరాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నార‌ని స‌మాచారం అందుకున్న డిప్యూటీ త‌హ‌సీల్దార్ రాథోడ్ సోరాజీ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆడే సురేష్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర ₹10,000 న‌గ‌దు ల‌భించిన‌ట్లు తెలిపారు.

సురేష్ భార్య సర్పంచ్ అభ్య‌ర్థి కావ‌డంతో ఆమె గెలిచేందుకు డ‌బ్బులు పంచుతున్న‌ట్లు అంగీక‌రించాడు. అతని వద్ద ఉన్న ₹10,000/- నగదు స్వాధీనం చేసుకుని, సంబంధిత అధికారులకు అప్పగించారు. ఎవ‌రైనా ఎన్నికల ప్రలోభాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రలోభాలకు గురి చేస్తున్న, ప్రజలకు డబ్బులు, మద్యం, బహుమతులు లాంటివి పంచినా చట్టరీత్యంగా నేరంగా పరిగణించి వారిపై చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like