అదుపు తప్పిన RTC బస్సు
ఆదిలాబాద్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ x రోడ్ వద్ద RTC బస్సు అదుపుతప్పింది. టైర్ పేలడంతో బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్ళింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో బస్సులో ప్రయాణికులను తరలించారు. కరంజి నుంచి ఆదిలాబాద్ వస్తుండగా ఘటన జరిగింది.
ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. జైనథ్ మండలం తరోడ వద్ద కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు .మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.