టాస్ ద్వారా గెలిచిన అభ్యర్థులు
Toss:అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు.. అలా ఈ అభ్యర్థులను అదృష్టం వరించి సర్పంచ్‌లయ్యారు. వివరాల్లోకి వెళితే… తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెలువడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దాబా(బీ) లో ఓ అభ్యర్థి టాస్ సాయంతో గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నర్వాటే ఈశ్వర్ కు 176 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి మానే రామేశ్వర్ కు సైతం 176 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేశారు. ఈ టాస్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి నర్వాటే ఈశ్వర్ గెలుపొందారు.
ఇక, యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం టాస్ ద్వారానే అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు 148 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డికి సైతం 148 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేశారు. ఈ టాస్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్య గెలుపొందారు.