నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన 50 మందిపై కేసు న‌మోదు

Violation of election regulations:ఎన్నిక‌ల్లో నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన 50 మందిపై కేసులు న‌మోదయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, నగదు, మద్యం పంపిణీ, రాత్రివేళ అక్రమ ప్రచారం, సైలెన్స్ పీరియడ్ ఉల్లంఘన, అనుమతి లేని విజయోత్సవ ర్యాలీ నిర్వహణ లాంటివి ఉట్నూర్ డివిజన్ పరిధిలోని దాదాపు 15 కేసులు నమోదు అయినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(Adilabad District SP Akhil Mahajan) తెలిపారు.

అక్రమంగా మద్యం, డబ్బు, బహుమతులు తరలకుండా పోలీస్ స్టేషన్ల వారిగా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఉట్నూర్ సబ్ డివిజన్‌లో 15 కేసులు నమోదు కాగా, అందులో ఐదు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన కేసులు ఉన్నట్లు తెలిపారు. ప్రజలు కచ్చితంగా పోలీసు నిబంధనలను పాటించాలని సూచించారు. రెండవ విడత ఎన్నికల ప్రచారం సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైంద‌ని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు సోషల్ మీడియాలో, బయట ప్రచారం చేయకూడదని తెలిపారు.

రెండు రోజుల్లో 15 నిబంధనల ఉల్లంఘన కేసులతో పాటు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన 5 బృందాలపై కేసులను నమోదు చేశామ‌న్నారు. బైక్ ర్యాలీలు, ర్యాలీలు నిర్వహించడం చట్ట విరుద్ధమ‌ని స్ప‌ష్టం చేశారు. అధికారుల అనుమతితో నిర్దేశించిన రోజు మాత్రమే విజయోత్సవ ర్యాలీలు చేయాల‌న్నారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like