గడ్డిపోతారం మున్సిపాలిటీ గెలుచుకున్న బీఆర్ఎస్
Gaddipotharam:మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం మున్సిపాలిటీకి చెందిన ఫలితాలు వెలువడ్డాయి. ఓ వైపు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ వార్డులు గెలుస్తుండగా, ఏకంగా ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకుని బీఆర్ఎస్ బోణీ కొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన ఫలితాల్లో బీఆర్‌ఎస్ గెలుచుకున్న మొదటి మున్సిపాలిటీ ఇదే కావడం విశేషం. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. గడ్డిపోతారం మున్సిపాలిటీలో 11 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా.. రెండు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
మొత్తం 18 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 14చోట్ల విజయం సాధించారు. 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఇతరులు ఒక చోట విజయం సాధించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఉదయం నుంచి ఉత్కంఠగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో చిత్ర విచిత్రమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ సత్తా చాటుతున్నారు. దీంతో ఇక్కడ ఫలితాలు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన వెంకటేశ్ అనూహ్య విజయాన్ని నమోదు చేశారు.