ఆసిఫాబాద్‌లో ఉద్రిక్త‌త‌..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్వ‌ల్ప‌ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్క‌డ మున్సిపాలిటీలో గెలుపొందిన స్వ‌తంత్ర అభ్య‌ర్థిని కారులో తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నించారు. దీంతో ఈ ప్ర‌య‌త్నాన్ని బీఆర్ఎస్ నేత‌లు అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే స్వ‌ల్ప ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఒక‌ట‌వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వినోద్ 78 ఓట్ల తేడాతో BRS అభ్య‌ర్థిపై గెలుపొందారు. ఫలితాల అనంతరం స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు బలవంతంగా ఆటోలో ఎక్కించి రహస్య ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, దీనిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు పార్టీల పెనుగులాటల మధ్య స్వతంత్ర అభ్యర్థి వినోద్ తప్పించుకుని వెళ్లిపోయారు. మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో స్వతంత్రుల పై పార్టీలు ఇలా ఒత్తిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. మ‌రి ఆ స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఎవ‌రికి మ‌ద్ద‌తు చెబుతారో వేచి చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like