కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త‌త‌

బెల్లంప‌ల్లిలో కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావర‌ణం చోటు చేసుకుంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల కౌంటింగ్ నేప‌థ్యంలో కేంద్రంలోకి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ వెళ్లారు. అయితే, దీనికి బీఆర్ఎస్ నేతలు అభ్యంత‌రం తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు స‌మానంగా సీట్లు రావ‌డంతో ఎమ్మెల్యే చైర్మ‌న్ ఎన్నిక ప్ర‌భావివ‌తం చేసేందుకు వ‌చ్చారంటూ వారు నిర‌స‌న‌కు దిగారు.

ఈ నేప‌థ్యంలోనే బీఆర్ఎస్ నాయ‌కులు తాండ్ర రామ‌కృష్ణ‌, బ‌త్తుల సుద‌ర్శ‌న్ .. కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ముచ్చ‌ర్ల మ‌ల్ల‌య్య‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కౌంటింగ్ కేంద్రం లోప‌లికి రావాలంటే అభ్య‌ర్థి, కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఉన్న‌వారే రావాల‌ని ఎమ్మెల్యే ఎలా వ‌స్తాడంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్ర‌శ్నించాయి. అదే స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య త‌దిత‌రులు సైతం ఆందోళ‌నకు సిద్ధం అయ్యారు. నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఎమ్మెల్యే వినోద్ వెనుదిరిగారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like