ఈ విజ‌యం వారికే అంకితం

CM Revanth Reddy:కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న తెలంగాన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమన్నారు. పార్టీ పట్ల వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు.

అదేవిధంగా, రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద–మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని అన్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like