బాల్క సుమన్ అరెస్ట్… కొనసాగుతున్న వైద్య పరీక్షలు

Balka Suman Arrest:బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పెద్దఎత్తున ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్‌లో తరలించారు. అయితే బాల్క సుమన్‌‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తల ఆందోళనల మధ్యే సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. .

క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంగళవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలపై క్యాతనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలివచ్చారు. ఆయన నివాసం చుట్టూ వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. చివరకు బీఆర్‌ఎస్ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like