బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
Balka Suman:బాల్క సుమన్ కేసు విషయంలో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు. ఇందులో ఏ 1గా బాల్క సుమన్, ఏ 2 గా మూల రాజిరెడ్డి, రాజారమేష్ తదితరులు ఉన్నారు. వీరిలో
అరెస్టైన నిందితులు:
ఏ1 – బాల్క సుమన్
ఏ2 – మూల రాజిరెడ్డి
ఏ4 – దోమకొండ అనీల్
ఏ8 – మామిడి లక్ష్మికాంత్
పరారీలో ఉన్న నిందితులు:
ఏ2 – గొడిసెల రాజారమేష్,
ఏ5 – గాజుల చంద్రకిరణ్,
ఏ6 – మేడిపల్లి సంపత్,
ఏ7 – గోగుల రవీందర్ రెడ్డి,
ఏ9 – బండారి సూరిబాబు,
ఇంకా మరికొంతమంది పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
బాల్క సుమన్‌పై కేసులు:
ఏ1 బాల్క సుమన్‌పై ఇప్పటికే మొత్తం 11 కేసులు ఉన్నట్లు రిమాండ్ డైరీలో పోలీసులు ప్రస్తావించారు. అతన్ని అరెస్టు చేయకపోతే మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని నిందితులు రాజకీయ నేపథ్యం కలిగినవారు కావడంతో సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడం జరిగే అవకాశం ఉందని
ఈ కారణాలతోనే అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు.