ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం
నీలాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మాదారం పోచమ్మ ఆలయం ముందు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ని నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దొంగలు ట్రాన్స్‌ఫార్మర్ పగలగొట్టి దానిలోని రాగి తీగని దొంగలించుకుపోయారు. ఈ విషయమై విద్యుత్A.Eకి, S.Iకి ఫిర్యాదు చేసినట్లు నీలాయపల్లి సర్పంచ్ పొలవేణి తిరుపతి స్పష్టం చేశారు. ఆ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి గ్రామ పంచాయతీ మొత్తానికి నీటి సరఫరా అవుతుందని తెలిపారు. దీంతో ఈ రోజు నుండి నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఈ సమస్యను పరిష్కారించి విద్యుత్ సప్లై పునః ప్రారంభం అయ్యే వరకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.