ఆ రెండు పిటిష‌న్లు 26కు వాయిదా..

Balka Suman:బాల్క సుమన్‌ సహా ఇతర బీఆర్‌ఎస్‌ నాయకుల అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ 26 ఫిబ్రవరి కి వాయిదా వేశారు. ఈ మేర‌కు మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి తీర్పు చెప్పారు. అదే స‌మ‌యంలో సుమ‌న్ బెయిల్‌కు సంబంధించి సైతం అడ్వకేట్ల వాదనలు ప్రతివాదన‌లు విన్న తర్వాత 26 కు వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే బాల్క సుమన్‌ అడ్వకేట్ల బృందం కౌంటర్‌ పిటిషన్‌ వేసిన విష‌యం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసు అధికారే ఇన్వెస్టిగేషన్‌ అధికారిగా ఉన్నారని, విచారణ పూర్తయ్యాకే కోర్టు రిమాండ్‌ విధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని కౌంటర్‌ దాఖలు చేశారు.

ఇరువైపులా వాద‌న‌లు విన్న జ‌డ్జి ఈ నెల 26కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. బాల్క సుమన్‌ కస్టడీ పిటిషన్ విష‌యంలో పోలీసులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. సుమన్‌ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, మంచిర్యాల జిల్లాలో కాకుండా ఆదిలాబాద్‌ లేదా రామగుండం పోలీస్‌ స్టేషన్లలో విచారించాలని.. అదీ కుదరకపోతే రహస్య ప్రదేశంలో విచారించాలని నిర్ణ‌యం తీసుకున్నారు. క‌స్ట‌డీ పిటిష‌న్ వాయిదా ప‌డ‌టంతో మ‌ళ్లీ పోలీసులు ఏం చేస్తార‌నేది వేచి చూడాలి.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like