తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

IAS officers transferred in Telangana: తెలంగాణాలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయశాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి.దివ్యను ప్రభుత్వం నియమించింది.

సంజయ్ కుమార్ (1995) – పరిశ్రమల శాఖ నుంచి పీఆర్ & ఆర్డీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ.

సబ్యసాచి ఘోష్ (1994) – ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ స్కీమ్స్ యూనిట్‌కు అదనపు బాధ్యతలు

ఎం.దాన కిశోర్ (1996) – డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు

ఎన్. శ్రీధర్ (1997) – ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం

రాహుల్ బొజ్జా (2000) – జనరల్ అడ్మినిస్ట్రేషన్ (పాలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ

ఈ. శ్రీధర్ (2004) – ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా నియామకం

డా. గౌరవ్ ఉప్పల్ (2005) – ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ సెక్రటరీగా బదిలీ

బి. విజయేంద్ర (2006) – మహబూబ్‌నగర్ కలెక్టర్ నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీగా బదిలీ

అద్వైత్ కుమార్ సింగ్ (2013) – మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్, న్యూ ఢిల్లీకి బదిలీ

ఎం. హనుమంతరావు (2013) – యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా నియామకం

సిక్తా పట్నాయక్ (2014) – నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ

సందీప్ కుమార్ ఝా (2014) – జనగాం కలెక్టర్‌గా నియామకం

పమెలా సత్పతి (2015) – కరీంనగర్ కలెక్టర్ నుంచి లేబర్ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ

అనురాగ్ జయంతి (2015) – యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియామకం

రాహుల్ రాజ్ పి.ఎస్ (2015) – మెదక్ కలెక్టర్ నుంచి కోఆపరేటివ్ కమిషనర్‌గా బదిలీ

జితేష్ వి. పటిల్ (2016) – టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ & ఎండీగా నియామకం

రిజ్వాన్‌బాషా షేక్ (2017) – జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ

సంతోష్ బి.ఎం (2017) – ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నియామకం

ప్రతీక్ జైన్ (2017) – నారాయణపేట్ కలెక్టర్‌గా బదిలీ

స్నేహా శబర్ష్ (2017) – మహబూబాబాద్ కలెక్టర్‌గా నియామకం

చిత్రా మిశ్రా (2019) – కరీంనగర్ కలెక్టర్‌గా నియామకం

గరిమా అగ్రవాల్ (2019) – రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియామకం

దీపక్ తివారీ (2019) – వికారాబాద్ కలెక్టర్‌గా బదిలీ

ప్రతిమా సింగ్ (2019) – మెదక్ కలెక్టర్‌గా నియామకం

అంకిత్ (2019) – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా బదిలీ

చహత్ బజ్‌పాయి (2019) – హన్మకొండ కలెక్టర్‌గా నియామకం

ఖుష్బూ గుప్తా (2019) – మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బదిలీ

మంద మకరందు (2020) – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా నియామకం

ఫైజాన్ అహ్మద్ (2021) – మేడ్చల్ అదనపు కలెక్టర్‌గా బదిలీ

శివేంద్ర ప్రతాప్ (2021) – హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ ఎండీగా నియామకం

పింకేశ్‌కుమార్ లలిత్‌కుమార్ (2021) – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా బదిలీ

ఉమా శంకర్ ప్రసాద్ (2022) – వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా నియామకం

Get real time updates directly on you device, subscribe now.

You might also like